Nara Bhuvaneswari to Annavaram Satyanarayana Swamy Temple: అన్నవరం సత్యదేవుణ్ని దర్శించుకోనున్న నారా భువనేశ్వరి - అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 25, 2023, 10:50 AM IST
Nara Bhuvaneswari to Annavaram Satyanarayana Swamy Temple: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోనున్నారు. దర్శనానంతరం చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసిస్తూ పత్తిపాడులో రిలే దీక్షలు కొనసాగిస్తున్న శిబిరాలకు ఆమె వెళ్లనున్నారు. నిరసన దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలపడంతో పాటు భువనేశ్వరి కూడా కాసేపు నిరసన దీక్ష శిబిరాల్లోనే కూర్చోనున్నారు.
చంద్రబాబును అరెస్టు చేసినప్పటి నుంచి రాష్ట్రంలో టీడీపీ నేతలు నిరసనలు చేస్తున్నారు. తమ అధినేతను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడుతున్నారు. పలుచోట్ల నిరాహార దీక్షలు చేపడుతున్నారు. దేవాలయాలలో పూజలు, యాగాలు చేస్తున్నారు. కేవలం రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ, వివిధ దేశాలలో కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు విడుదల అయ్యేంతవరకూ తమ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో పలువురు కార్యకర్తలు ప్రాణాలు సైతం వీడారు. దీంతో కార్యకర్తలు అంతా ధైర్యంగా ఉండాలని.. త్వరలోనే చంద్రబాబు కడిగిన ముత్యంగా బయటకు వస్తారని టీడీపీ నేతలు తెలుపుతున్నారు.