ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP_Leader_BT_Naidu_on_Nara_Bhuvaneshwari_Nijam_Gelavali_Yatra

ETV Bharat / videos

కర్నూలులో రేపటి నుంచి భువనేశ్వరి 'నిజం గెలవాలి' పర్యటన - నిజం గెలవాలి యాత్ర

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2024, 5:47 PM IST

Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra: చంద్రబాబు సతీమణి భువనేశ్వరి 'నిజం గెలవాలి' పర్యటనలో భాగంగా రేపటి నుంచి రెండు రోజులపాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీటీ నాయుడు తెలిపారు. ఈ యాత్రలో భాగంగా చంద్రబాబు అరెస్టు సమయంలో జిల్లాలో మనోవేదనకు గురై మరణించిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నట్లు చెప్పారు. మంగళవారం కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో పర్యటించనున్న ఆమె, బుధవారం ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారని తెలిపారు.

"టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా రేపటి నుంచి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో టీడీపీ కార్యకర్తలు మనోవేదనకు గురై మరణించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. రెండు రోజులపాటు జిల్లాలోని కోడుమూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మొదటి రోజు కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గం ఆమె పర్యటించనున్నారు. రెండో రోజు ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో భాదిత కుటుంబ సభ్యుల ఇంటికి నారా భువనేశ్వరి వెళ్లనున్నారు."- బీటీ నాయుడు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details