Farmers Agitation: పరిహారం కోసం రోడ్డెక్కిన రైతన్నలు.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన - government grabbed lands from farmers
Farmers Agitation: రైతుల నుంచి సేకరించిన భూములకు ఎక్కువ పరిహారం చెల్లిస్తామని చెప్పి.. తక్కువ చెల్లించటంపై నంద్యాల జిల్లా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు నుంచి దోర్నాల వరకు 340- సీ పేరుతో నిర్మించనున్న జాతీయ రహదారి కోసం.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 715 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో ప్రభుత్వ భూమి 46 ఎకరాలు కాగా.. మిగిలినది రైతుల నుంచి తీసుకున్నారు. గ్రామ సభలు నిర్వహించకుండా ఎంత నష్టపరిహారం చెల్లిస్తారో చెప్పకుండా.. మార్కెట్ ధరకంటే చాలా తక్కువ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. దీనిపై జూపాడుబంగ్లా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవనాధారమైన భూమిని రోడ్డు నిర్మాణం కోసం ఇచ్చి తామెలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన నిర్వహించి పరిహారం సమ్మతం కాదని తహశీల్దారుకు వినతిపత్రం అందించారు. తమకు న్యాయంచేస్తేనే రహదారి నిర్మాణానికి సహకరిస్తామని.. లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్న రైతులతో ముఖాముఖి.