ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వినూత్నంగా ఎన్టీఆర్ చిత్రం

ETV Bharat / videos

NTR Letter Drawing: చిత్రం భళారే..! అన్న గారి సినీ, జీవిత విశేషాలతో అక్షర నివాళి.. - artist chintapalli kotesh

By

Published : May 28, 2023, 5:02 PM IST

NTR Letter Drawing: ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రాన్ని ఓ కళాకారుడు విభిన్నంగా ఆవిష్కరించాడు. నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతపల్లె కోటేశ్‌.. నందమూరి తారక రామారావు నటించిన 302 చిత్రాల పేర్లు, ఎన్టీఆర్ జీవిత విశేషాలతో ఆ మహనీయుడి చిత్రాన్ని గీశారు. విద్యాభ్యాసం, సినీ, రాజకీయ జీవితంలోని విశేషాలతో దీనిని తయారుచేసినట్లు కోటేశ్ చెప్పారు. అన్నదాత వేషధారణలో రామారావును చూపిస్తూ గీసిన ఈ చిత్రాన్ని ఏ3 డ్రాయింగ్ షీట్​పై తీర్చిదిద్దారు. 

ఈ చిత్రాన్ని వేసేందుకు మూడు గంటల సమయం పట్టినట్లు చిత్రకారుడు కోటేశ్ తెలిపారు. ఎన్టీఆర్​కు ఉన్న కోట్లాది మంది అభిమానులలో తాను కూడా ఒకడిని అని ఆయన చెప్తున్నారు. ఎన్టీఆర్​పై అభిమానంతో అక్షర చిత్ర నివాళి అర్పిస్తున్నట్లు కోటేశ్‌ అన్నారు. ఎన్టీఆర్​కు ఉన్న కోట్లాది మంది అభిమానులలో తాను కూడా ఒకడిని అని ఆయన చెప్తున్నారు. ఆయన మీద అభిమానంతోనే చిత్రం గీసినట్లు చెప్పారు. గతంలో కూడా పలు చిత్రాలు గీసినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details