ఆంధ్రప్రదేశ్

andhra pradesh

charka_meet_cs

ETV Bharat / videos

జడ్జి ముందు నేరం అంగీకరించినా అజయ్ జైన్​పై చర్యలు ఏవి?: ఏపీ టుమారో చక్రవర్తి - ఫైబర్​నెట్ కేసు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2023, 2:59 PM IST

Nallapothu Chakravarty Meet CS : ఫైబర్​నెట్ కేసులో తప్పుచేశానంటూ ఒప్పుకున్న ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్​పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏపీ టుమారో  సంస్థ అధ్యక్షుడు నల్లపోతు చక్రవర్తి ఆరోపించారు. తాను ఏ తప్పు చేయలేదని చెబుతున్నా చంద్రబాబుపై కేసు నమోదు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. సాక్షాత్తు జడ్జి ముందే 164 కింద నేర వాంగ్మూలమిచ్చిన అజయ్​జైన్​పై కేసు నమోదు చేయలని డిమాండ్ చేశారు. తప్పు చేశానంటూ ఒప్పుకున్న అజయ్​జైన్​.. విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఆయనపై ఎలాంటి అధికార చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

తప్పు చేసినట్లు స్వయంగా అజయ్​జైన్​ అంగీకరించిన కారణంగా.. ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) జవహర్ రెడ్డి కలిసేందుకు సచివాలయానికి వెళ్లానన్నారు. వినతి పత్రాన్ని స్వీకరించేందుకు సీఎస్ నిరాకరించారని వెల్లడించారు. సామాన్యులకు సచివాాలయంలో కనీస ప్రవేశం లేదని మండిపడ్డారు. ఇలా అయితే ప్రజలు ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనా రాచరిక వ్యవస్థకు నిదర్శనమని విమర్శించారు. 

ABOUT THE AUTHOR

...view details