'నేరం చేశానని ఒప్పుకున్న అజయ్జైన్పై కేసు ఏదీ? - ప్రజల అవసరాలు తీర్చే వ్యవస్థ కనిపించట్లేదు'
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 12, 2023, 2:02 PM IST
Nallamothu Chakravarthy on Fiber Net Case:ఫైబర్ నెట్ అంశంలో అక్రమాలు జరిగాయని ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ ఒప్పుకున్న ఈ కేసులో ఆయన పేరు చేర్చకపోవడాన్ని ఏపీ టుమారో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు నల్లమోతు చక్రవర్తి తప్పుపట్టారు. ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఆయన ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చారని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసులో అధికారులను భయపెట్టి.. ప్రభుత్వం కల్పితాలను సృష్టిస్తోందంటుని చక్రవర్తి అన్నారు.
'ఈ కేసులో అజయ్ జైన్ చేసిన అన్యాయంపై ఇంకా కొంతమంది ఐపీఎస్ల మీ ఫిర్యాదు చేద్దామని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలవడానికి వెళ్లగా.. అక్కడ పోలీసులు కలవనివ్వలేదు.. ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఇలా చేయడం దారుణం' అని అన్నారు. తరువాత ఆయనకు ఈ మెయిల్ చేశా కాని ఆయన వద్ద నుంచి మాకు ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. చంద్రబాబు చెప్తే తప్పు చేశానని చెప్పిన అజయ్ జైన్ పేరు అసలు ఈ కేసులో లేకపోవడం, పైగా ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హౌసింగ్గా చలామణీ అవుతున్నారని అన్నారు.