Nakka Anand Babu Interview on Bandaru Satyanarayana Arrest: "నిరసన దీక్షల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బండారు సత్యనారాయణ అరెస్టు" - Comments on the arrest of Nakka Anand Babu Bandaru
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 3, 2023, 12:25 PM IST
Nakka Anand Babu Interview on Bandaru Satyanarayana Arrest :మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు దృష్ట్యా గుంటూరులో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు పోలీసులు గృహ నిర్బంధం (Nakka Anand Babu House Arrest in Guntur) చేశారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా చేపట్టిన దీక్షల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. మంత్రి రోజాను విమర్శిస్తే కేసులు పెట్టి అరెస్టు చేయటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పోలీసు అధికారులతో విపక్షాలపై కేసులు పెట్టించే సంస్కృతి వైసీపీ పాలనలోనే చూస్తున్నామని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కక్షపూరితంగా చంద్రబాబు నాయుడని అరెస్టు చేశారని ప్రజలు భావిస్తున్నారని.. అందుకే ప్రజలు గ్రామాల్లో సైతం ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ని తప్పని సరిగా తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ప్రస్తుత అంశాలపై నక్కా ఆనంద్ బాబుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి..