ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nadendla_Manohar_on_Pala_velluva

ETV Bharat / videos

పాల వెల్లువ పథకంలో 2వేల కోట్లకు పైగా కుంభకోణం : జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ - నాదెండ్ల మనోహర్‌

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2023, 5:34 PM IST

Nadendla Manohar on Pala Velluva Scheme:వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన'పాలవెల్లువ పథకం' పాపాల వెల్లువలా మారిందని.. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పాల వెల్లువ పథకంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. పాడి పశువుల కొనుగోలు విషయంలో ఒక్కోరోజు ఒక్కో లెక్క చెబుతున్నారని ఆయన ఆగ్రహించారు.

Nadendla Manohar Comments: గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''పాల వెల్లువ పథకం పాపాల వెల్లువగా మారింది. లక్షల సంఖ్యలో గేదెలు కొనుగోలు చేసినట్లు లెక్కల్లో చూపారు. కానీ క్షేత్రస్థాయిలో 8 వేల పశువులు మాత్రమే ఉన్నాయి. మహిళా సాధికారత అంటూనే.. రూ. 2వేల 8వందల 87 కోట్లు దోచేశారు. ఈ లెక్కలు చూస్తుంటే.. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం అని చెప్పి, నిధుల్ని కొల్లగొట్టి నిధులు దోచేసింది. ప్రజలకు అర్ధం కాని విధంగా పంపిణీ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. పాడి పశువుల కొనుగోలులో ఒక్కో రోజు ఒక్కో లెక్క చెబుతున్నారు.'' అని మనోహర్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details