ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జగన్​ నొక్కే బటన్​తోనే ప్రజలు బుద్ది చెప్పాలి - నాదెండ్ల మనోహర్​ - andhra pradesh political news

🎬 Watch Now: Feature Video

government_running_programs_to_trouble_the_people

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2023, 1:36 PM IST

Nadendla Manohar meeting: బటన్లు నొక్కి నిధులు విడుదల చేసే ముఖ్యమంత్రి జగన్​కు అదే బటన్​తో ప్రజలు బుద్ధి చెప్పాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రజలకు పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని.. ఈసారి ఓటు వేయాలని ప్రజలను కోరారు. రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీకి ఇవ్వనంత మెజారిటీని వైసీపీకి ప్రజలు ఇచ్చినా పరిపాలన చేతకాక ఇచ్చిన అవకాశాన్ని జగన్ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు నిర్వహిస్తోందని మనోహర్ మండిపడ్డారు. రాష్ట్రంలో తదుపరి వచ్చే ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అది మహిళల అభివృద్ధి కోసమే ఉండాలని పేర్కొన్నారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వీర మహిళలతో మనోహర్ సమావేశం అయ్యారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలాను మహిళలు మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు. జగనన్న కాలనీల చెత్త పన్ను, అక్రమ మద్యం, విచ్చలవిడిగా గంజాయి విక్రయిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details