ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nadendla_Manohar_on_Visakha_Infosys

ETV Bharat / videos

Janasena Nadendla Manohar on CM Jagan పోలీసులు లేకుండా ఎమ్మెల్యేలు గడప గడపకు కార్యక్రమం నిర్వహించాలి: నాదెండ్ల మనోహర్ - Visakha Infosys news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2023, 5:00 PM IST

Nadendla Manohar Harsh Comments on CM Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగకుండా నష్టం జరగాలని సీఎం జగన్ కంకణం కట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం, రైతుల పట్ల సరైన ప్రణాళిక లేకపోవటం వల్ల సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహించారు. విశాఖలో ఇన్ఫోసిస్ ఏర్పాటు చేసింది శాటిలైట్ కార్యాలయం మాత్రమేనన్న మనోహర్.. ఇన్ఫోసిస్‌ను జగనే తెచ్చినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  

Nadendla Manohar Comments: గుంటూరు జిల్లా తెనాలి మండలం చావవారిపాలెంలో నాదెండ్ల మనోహర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..''వైసీపీ వచ్చాక ఒక్క సాగునీటి కాలువ గేటు బాగు చేయలేదు. కనీసం కాలువల్లో పూడిక కూడా తీయలేదు. విశాఖలో ఇన్ఫోసిస్ ఏర్పాటు చేసింది శాటిలైట్ కార్యాలయం మాత్రమే. కానీ, ఆ కంపెనీ ముఖ్యమంత్రి వల్లే వచ్చినట్లు గొప్పలకు పోతున్నారు. పెట్టుబడుల సదస్సులో చేసుకున్న ఒప్పందాలు ఏమయ్యాయో ఈ ప్రభుత్వం చెప్పాలి..?. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి వచ్చిందంటే అందుకు సీఎం జగనే కారణం. మంత్రులకు వారి శాఖలపై పట్టులేకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. పోలీసులు సహాయం లేకుండా వైసీపీ శాసన సభ్యులు గడప గడప కార్యక్రమం నిర్వహించాలి. అప్పుడే ప్రజాగ్రహం రుచి చూస్తారు. తెనాలిలో నన్ను గెలిపిస్తే విజయవాడ, గుంటూరుకు దీటుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నా. ప్రజల ఆశలను వైసీపీ ప్రభుత్వం ఒమ్ము చేసింది. ఇసుక, మద్యంతో వచ్చిన ఆదాయాన్ని ప్రజల కోసం ఖర్చు చేయకుండా వాటిని వారి ఖాతాలో వేసుకున్నారు. ఈ నాలుగేళ్లు ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చారా..?'' అని ఆయన ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details