Nadendla Manohar Allegations on TOEFL Training: టోఫెల్ శిక్షణ పేరుతో.. ఏటా వెయ్యి కోట్ల దోపిడీకి వైసీపీ యత్నం : నాదెండ్ల మనోహర్ - AP Latest News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 11, 2023, 4:49 PM IST
|Updated : Oct 11, 2023, 5:31 PM IST
Nadendla Manohar Allegations on YCP Corruption in TOEFL Training:రాష్ట్ర ప్రభుత్వం టోఫెల్ శిక్షణ పేరుతో ఈటీఎస్ అనే సంస్థకు ఏటా వెయ్యి కోట్లు దోచిపెట్టడానికి సిద్ధమైందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలిలో మీడియాతో మాట్లాడిన మనోహర్ వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సంస్కరణల పేరిట దోచుకుంటోందని దుయ్యబట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏడాదికి 40వేల మందికి మాత్రమే అమెరికా వీసాలు ఇస్తుంటే.. లక్షలాది మందికి శిక్షణ ఇప్పిస్తామనటం ఎవరిని మోసం చేయడానికి అని మనోహర్ ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం టోఫెల్ పేరుతో ఇష్టానుసారంగా నిధులను ఖర్చు చేస్తోంది.. అందిన కాడికి దోచుకుంటున్నారని నాదెండ్ల విమర్శించారు. విద్యల పేరుతో పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ నేతలతో చేయించే బస్సు యాత్ర ప్రజలను మోసం చేయడానికేనని మనోహర్ విమర్శించారు. ముఖ్యమంత్రి మాత్రం హెలికాప్టర్లో తిరుగతూ ప్రతిపక్షాలను తిట్టడానికి ప్రజాధనం దర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.