Mysura Reddy on kurnool న్యాయరాజధాని కర్నూలు అంటూ.. చెవులో పూలు పెట్టారు: మైసూరా రెడ్డి - ఏపీ తాజా వార్తలు
Mysura Reddy: రాయలసీమ ప్రాంతానికి మొదటి నుంచి అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి మైసూరా రెడ్డి అన్నారు. కర్నూలులో రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రాయలసీమకు నీటి ప్రాజెక్టులు, నిధులు, ఉద్యోగాల కోరకు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైసూరా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినా తమ పరిస్థితి ఏమీ మారలేదని అన్నారు. మూడూ రాజధానులు అని ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టారు.. ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని విమర్శించారు.
హైకోర్టు పేరుతో న్యాయరాజధాని అని కర్నూలుకు పేరుపెట్టి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల చెవుల్లో పూలు పెట్టారని మైసూరా రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వంతెన నిర్మిస్తుంటే ముఖ్యమంత్రి స్పందించి వంతెనతో పాటు బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని.. అందుకు ప్రయత్నం చెయ్యడంలేదని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.