ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Murthy Yadav allegations

ETV Bharat / videos

విశాఖలో దసపల్లా భూముల టీడీఆర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి : జనసేన నేత మూర్తి యాదవ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2023, 7:44 PM IST

Murthy Yadav allegations on YCP leader Vijayasai Reddy: విశాఖ నగరం నడిబొడ్డున వేల కోట్ల విలువైన దసపల్లా హిల్స్ భూములను నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి చేజిక్కించుకున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆక్రమనలను నిలుపుదల చేస్తానంటూ తాజాగ తెరపైకి వచ్చిన వైసీపీ ఇన్‌ఛార్జ్‌ వైవీ సుబ్బారెడ్డి సైతం  ప్రస్తుతం అతనితో కలిసి 2 వేల కోట్ల రూపాయల విలువ చేసే టీడీఆర్‌ స్కాం కు తెరలెపారని తెలిపారు. విశాఖలో అభివృద్ధి కంటే కుంభకోణాలే అధికంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. 

 విశాఖ ప్రజలు ఎవరూ అడగకుండానే దసపల్లా హిల్స్​ గుండా  100 అడుగుల రోడ్డు విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా వేల కోట్లు దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ పెద్దల కోసం పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ అధికారులు టీడీఆర్​లో మార్పులు చేస్తున్నరని మూర్తి యాదవ్ ఆరోపించారు. అందు కోసమే  ధనుంజయ రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మీ విశాఖ అధికారులతో పదేపదే సమీక్షలు జరుపుతున్నారని మూర్తి యాదవ్ పేర్కొన్నారు. అధికారులు చెప్పిందే తడవుగా జీవీఎంసీ కమిషనర్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. ఇందుకోసం జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి, రహదారి నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారని వెల్లడించారు. ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు జరిపించాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. 

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details