ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Murder_in_Kadapa

ETV Bharat / videos

కడపలో 24 గంటల్లో మరో హత్య - తీసుకున్న అప్పు తిరిగివ్వలేదని కత్తితో - వైఎస్సార్ కడప జిల్లా లేటెస్ట్ న్యూస్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2023, 1:34 PM IST

Murder in Kadapa: కడపలో 24 గంటల్లో మరో హత్య జరిగింది. కడప జీవిత భీమా కార్యాలయంలో వార్డు వాలంటరీ భవాని శంకర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అర్ధరాత్రి కడప పాత బైపాస్ వద్ద సాయికిరణ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం రామచంద్రపురానికి చెందిన సాయికిరణ్ కడపలోని ప్రైవేట్ షోరూంలో పనిచేస్తున్నారు. 

Stabbed to Death: సాయికిరణ్, మహేశ్​కు 50 వేల రూపాయలు బాకీ ఉన్నాడు. నగదు విషయమై సాయికిరణ్, మహేశ్​ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన మహేశ్ కత్తితో సాయికిరణ్​పై దాడి(Knife Attack) చేశారు. మహేశ్ వెంటనే సాయికిరణ్​ను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన అనంతరం మహేశ్ చిన్న చౌక్ పోలీస్ స్టేషన్​కి వెళ్లి పోలీసుల అధికారులకు లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details