Murder Attempt on Wife and Children in Vijayawada: అనుమానంతో భార్య, పిల్లలపై హత్యాయత్నం.. చికిత్స పొందుతూ చిన్న కుమారుడు మృతి - Murder Attempt on Wife and Children
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 6, 2023, 10:42 PM IST
Murder Attempt on Wife and Children in Vijayawada: విజయవాడ దారుణం చోటు చేసుకుంది. బాప్టిస్ట్పాలెంలోని వినుకొండ వారి వీధిలో మురళీకృష్ణ అనే వ్యక్తి.. భార్య భవానిపై కత్తితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తొలుత భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లలకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చాడు. దీంతో ఇద్దరు పిల్లలు కింద పడిపోగా.. కూల్ డ్రింక్‌లో ఏం కలిపావని భర్తని భార్య ప్రశ్నించింది. అదే సమయంలో తాను తెచ్చుకున్న కత్తితో భార్యపై సైతం దాడికి పాల్పడ్డాడు. అనంతరం తనను తాను గాయపరుచుకున్నాడని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో చిన్న కుమారుడు మృతి చెందగా.. పెద్ద కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. భార్యపై కత్తితో దాడి చేసిన అనంతరం భర్త ఆత్మహత్యాయత్నం చేయగా.. ప్రస్తుతం అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సత్యనారాయణ పురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. భర్త, భార్య, కుమారుడు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.