తల్లికి ఫోన్ చేసిన భార్య - ఇంటికి వచ్చిన అత్త, బావమరిదిపై అల్లుడి హత్యాయత్నం - nandhyala latest news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2023, 12:23 PM IST
Murder Attempt on aunt and brother-in-law: నంద్యాల జిల్లాలో ఓ వ్యక్తి.. బావమరిదిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. అడ్డుకోబోయిన అత్త పొట్టలో అతికిరాతకంగా కత్తిని దింపాడు. పాణ్యంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
Knife Attack in Nandhyala: నంద్యాల జిల్లా పాణ్యం బస్టాండ్ సమీపంలో గణేష్.. భార్య తులసితో నివసిస్తున్నారు. డబ్బుల కోసం తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. గురువారం భర్త వేధింపులు ఎక్కువ్వడంతో.. భరించలేక గద్వాలలో ఉన్న తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది. భర్త చంపుతానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో హుటాహుటిన తులసి తల్లి జయలక్ష్మి, సోదరుడు అరుణ్ రాత్రి 12 గంటలకు పాణ్యానికి చేరుకున్నారు. వీరిని చూసిన గణేష్ మీరెందుకు వచ్చారంటూ.. ప్రశ్నిస్తూ దాడికి పాల్పడ్డాడు. అరుణ్ గుండెపై కత్తితో పొడుస్తుండగా.. తల్లి అడ్డుకోబోయింది. దీంతో ఆమె పొట్టలోనూ కత్తి దింపాడు. కిరాతకుడి నుంచి తప్పించుకున్న తల్లీ, కుమారుడు పోలీసులను ఆశ్రయించారు. తీవ్ర గాయాలైన వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గణేష్ నిత్యం డబ్బుల కోసం వేధిస్తూ, కొట్టేవాడని తన కోసం వచ్చిన అమ్మ, అన్నపై కత్తితో దాడి చేశాడని తులసి పోలీసులకు తెలిపింది.
TAGGED:
నంద్యాల జిల్లాలో కత్తి దాడి