కార్మికుల వేతనాలు పెంచేందుకు డబ్బులు లేవనటం దారుణం- జగన్ సర్కారుపై బీవీ రాఘవులు ధ్వజం - మున్సిపల్ కార్మికుల ధర్నా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 7, 2024, 7:40 PM IST
Municipal Workers Protest at Vijayawada:మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె 13వ రోజుకు చేరుకుంది. విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పాల్గొన్నారు. కార్మికులకు వేతనాలు పెంచడానికి డబ్బులు లేవంటూ ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. విశాఖలో విలాసవంతమైన సీఎం క్యాంపు కార్యాలయం నిర్మించుకోవడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని రాఘవులు ప్రశ్నించారు. కార్మికులు చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని ఎలా పోషిస్తారని మండిపడ్డారు. ఈ క్రమంలో సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
"13 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నా వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిరాకరిస్తోంది. కార్మికులకు వేతనాలు పెంచడానికి డబ్బులు లేవంటూ ప్రభుత్వం చెప్పడం దారుణం. మరి విశాఖలో విలాసవంతమైన సీఎం క్యాంపు కార్యాలయం నిర్మించుకోవడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి? కార్మికులు చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారు?. - బీ.వీ రాఘవులు, సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు