ఆంధ్రప్రదేశ్

andhra pradesh

municipal_council_meeting_turned-_into_rasabhasa

ETV Bharat / videos

రసాభాసగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం - వైదొలిగిన ఛైర్ పర్సన్ - రసాభసగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2023, 12:16 PM IST

Municipal Council Meeting Turned Into Rasabhasa: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ మనోజకు అదే పార్టీకి చెందిన కౌన్సిలర్ మధ్య వివాదం జరగటంతో.. మనోజకు వ్యతిరేకంగా వైసీపీ కౌన్సిలర్లు గొడవకు దిగారు. గత కౌన్సిల్ సమావేశంలో మెజారిటీ కౌన్సిల్ ఆమోదించిన అజెండాలోని అంశాలకు కొంతమంది కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. అవే అంశాలను మళ్లీ కౌన్సిల్ సమావేశం అజెండాలో పొందుపరచటంపై వైస్ ఛైర్ పర్సన్ వెంకటచలపతి ఛైర్ పర్సన్ మనోజాను నిలదీశారు. కౌన్సిలర్లు ఆమోదించిన అంశాలను మళ్లీ అజెండాలో పెట్టడం మమ్మల్ని అవమాన పరచడమేనని పేర్కొన్నారు. 

వెంటనే ఈ అంశాలను మినిట్స్​లో నమోదు చేయాలని కౌన్సిలర్లు ఛైర్ పర్సన్ పోడియంను చుట్టుముట్టారు. ఇరువురి మధ్య వాదోపవాదాలు జరగటంతో చివరకు ఛైర్ పర్సన్ మనోజ తన సీటులోనుంచి లేచి వెళ్లడానికి ప్రయత్నించగా కౌన్సిలర్లు అడ్డుకునేందుకు యత్నించారు. చివరకు ఆమె సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.    

ABOUT THE AUTHOR

...view details