Visakha Girl Keerthika: చదువుతో పాటు సంగీతంలో ప్రశంసల 'కీర్తి'క - విశాఖ మల్టీటాలెంటెడ్ యువతి కీర్తిక
Multi Talented Visakha Young Girl Keerthika: చిన్ననాటి నుంచి సంగీతం, చదువు.. ఈ రెండే ఆమెకు ప్రపంచం. మధ్యలో చదువు కోసం సంగీతం వదిలేసినా ప్రస్తుతం మళ్లీ కొనసాగించే పనిలో పడింది ఈ విశాఖ యువతి. అటు చదువులోనూ రాణిస్తూ పలు ఐఐఎంల నుంచి కాల్ లెటర్స్ అందుకుంది. క్యాట్‌లో మంచి ర్యాంకు పొందిన కీర్తిక.. 10 ఐఐఎంల ఇంటర్వ్యూలకు హాజరైంది. కాగా వాటిలో 9 ఐఐఎంల నుంచి కాల్ లెటర్స్ అందుకుంది. కాగా వాటిలో ఐఐఎం ఉదయ్‌పూర్‌ను ఆమె ఎంచుకుంది. ఈ ప్రయాణంలో కుటుంబం, స్నేహితులే తనను ప్రోత్సహించారని ఆమె చెబుతోంది. ఇష్టమైన పని చేసేందుకు.. తనను ఎప్పుడూ ప్రోత్సహించే కుటుంబం ఉండడం తన అదృష్టమని కీర్తిక అంటోంది. చిన్నప్పుడే ఆమె కర్ణాటక సంగీత సాధన చేసింది. అయితే తన చదువు దృష్ట్యా.. సంగీతాన్ని మధ్యలో వదిలేసింది. సంగీతం ఒత్తిడిని దూరం చేస్తుందంటూ.. మళ్లీ దాన్ని కొనసాగించే పనిలో ఉన్నానని ఆమె చెబుతోంది. ప్రస్తుతం మంచి ఉద్యోగం చేస్తూ తనకు వీలైనంత మందికి సహాయం చేయడమే తన లక్ష్యమంటున్న కసిరెడ్డి కీర్తికతో ముఖాముఖి.