MPP Sudharani Cried ఉత్తుత్తి పదవులెందుకు..! కన్నీటి పర్యంతమైన అధికార పార్టీ ఎస్సీ మహిళా ఎంపీపీ ! - దర్శి ఎంపీపీ సుధారాణి
MPP Sudharani Cried: ప్రకాశం జిల్లా దర్శిలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. అధికారాలు లేని కుర్చీలు, పదవులు ఎందుకంటూ.. ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ ఎంపీపీ కన్నీటి పర్యంతం అయ్యారు. దర్శి ఎంపీపీ సుధారాణి.. మండల పరిషత్ సమావేశంలో పాల్గొన్నారు. అధికారులు తనకు సహకరించడం లేదని, మండలంలో జరిగే ఏ విషయాలూ తనకు తెలియకుండానే.. అధికారులు ఇతర నాయకులు ఆమోదించు కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో జరిగే ఏ విషయాలు తమతో చర్చించడం లేదని ఎంపీపీ సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు మాకు ఈ కుర్చీలు ఎందుకు, ఈ పదవులు ఎందుకు అంటూ అధికారులను సూటిగా ప్రశ్నించారు. ఎస్సీ ప్రజా ప్రతినిధిని కావడం వల్లే.. తనను లెక్కచేయడం లేదని.. ఈ విషయపై జగనన్న జోక్యం చేసుకోవాలంటూ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. తనను చులకనగా చూస్తున్నారని, అవమానిస్తున్నారని.. సుధారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవో తన అధికార బలంతో తనపై పెత్తనం చాలాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు.