MP Raghurama raju comments: "జగన్ ఆడిస్తున్న తోలుబొమ్మలాటలో కొంతమంది ఐపీఎస్‌లు" - మార్గదర్శి కేసు
MP Raghuramaraj is angry with AP CID chief : ఏపీ సీఐడీ చీఫ్, ఐపీఎస్ సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానని ఎంపీ రఘురామరాజు తెలిపారు. మార్గదర్శి కేసు విషయంలో సంజయ్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన తీరు జుగుప్సాకరమని ఆయన పేర్కొన్నారు. మార్గదర్శిని మూసివేస్తామని చెప్తున్న సంజయ్.. అసలు కేసు దర్యాప్తు పూర్తి కాకుండా ఎలా చర్యలు తీసుకోగలరని ఎంపీ రఘురామ ప్రశ్నించారు. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ 4 రాష్ట్రాల్లో సేవలు అందిస్తోందని ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. "ఒక దర్యాప్తు సంస్థ అధికారిగా పని చేస్తున్న వ్యక్తి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కేసు గురించి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం, ఫిర్యాదు లేదు కదా అని ప్రశ్నించిన మీడియాకు ఇచ్చిన వివరణ జుగుప్సాకరంగా ఉంది. సీఎం జగన్ ఆడిస్తున్న తోలుబొమ్మలాటలో కొంతమంది ఐపీఎస్‌లు ఉన్నారు. మార్గదర్శి కేసును యువతిపై లైంగిక దాడి, చిన్న పిల్లలకు చాక్లెట్లు అంటూ పోల్చడం సరికాదు. చందాదారులు చాక్లెట్లు తీసుకునే చిన్న పిల్లల్లా కనిపిస్తున్నారా..?" అని రఘురామరాజు అసహనం వ్యక్తం చేశారు.