ఆంధ్రప్రదేశ్

andhra pradesh

mp_raghu_rama_krishnam_raju

ETV Bharat / videos

ఆ ఇద్దరు ఐపీఎస్​లపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీకి ఎంపీ రఘురామరాజు లేఖ - MP Raghu Rama Krishnam Raju on ips

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2023, 3:58 PM IST

MP Raghu Rama Krishnam Raju Writes Letter To PM Modi: తనపై కస్టోడియల్ హింసకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ...  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైసీపీ (YCP) ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తనను హింసించిన వారిలో ఇద్దరు ఐపీఎస్‌లు (IPS) ఉన్నారన్న రఘురామ.. పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు పేర్లను లేఖలో పేర్కొన్నారు. కస్టోడియల్‌ హింసపై సీబీఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ... గతంలో ఏపీ సీఐడీ (AP CID) రఘురామను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసు కస్టడీలో తనను హింసించినట్లు అప్పట్లో  రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధానికి రఘురామ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంత కాలంగా అధికార వైసీపీ విధానాలపై ఆయన ప్రశ్నిస్తూ వస్తున్నారు. స్వంత పార్టీపై విమర్ళల నేపథ్యంలో ఆయనపై కేసులు పెట్టారనే ఆరోపణలు సైతం వచ్చాయి. 

ABOUT THE AUTHOR

...view details