Mother and Son Died Within 24 hours: విస్సన్నపేటలో విషాదం.. 24 గంటల వ్యవధిలో తల్లీకుమారుడు మృతి - Mother son died in NTR district within 24 hours
Mother and Son Died Within 24 hours : ఎన్టీఆర్ జిల్లాలో మనసు కలచివేసే దృశ్యం గ్రామస్థుల కంట కన్నీళ్లు పెట్టించింది. 24 గంటల వ్యవధిలోనే తల్లి, కుమారుడు మృతి చెందిన ఘటన విస్సన్నపేటలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విస్సన్నపేట గ్రామం సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా చంటి టైలర్‌గా గుడాల వీరబాబుకు చాలా మంచి పేరు ఉంది. గత కొంతకాలంగా ఆయన తల్లి గుడాల సీతామహాలక్ష్మి(80) వయస్సు రీత్యా అనారోగ్యంతో బాధపడుతుండేది. ఆయన విజయవాడలోని ఓ ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. తల్లిని కాపాడుకోవడానికి శక్తికి మించి విశ్యప్రయత్నాలు చేశారు. కానీ విధి వెక్కిరించింది. శుక్రవారం ఉదయం గుడాల సీతామహాలక్ష్మి మృతి చెందారు. మాతృమూర్తి మరణ వార్తను విన్న వీరబాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్పందిచిన బంధువులు హుటాహుటిన వీరబాబును ఓ ప్రవేటు ఆసుపత్రికి తరిలించారు. పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్నారు. శనివారం సాయంత్రం మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కన్నతల్లి మరణించిన 24 గంటలలోనే తనయుడు మరణించడంతో.. విస్సన్నపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.