ఆంధ్రప్రదేశ్

andhra pradesh

mother_and_daughter_died_due_to_house_wall_collapsed

ETV Bharat / videos

Mother and Daughter Died Due to House Wall Collapsed: మన్యం జిల్లాలో విషాదం.. ఇంటి గోడ కూలి నిద్రిస్తున్న తల్లీకుమార్తె మృతి - నర్సీపురంలో తల్లీకుమార్తెల మృతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2023, 5:25 PM IST

Mother and Daughter Died Due to House Wall Collapsed: మన్యం జిల్లాలోని ఓ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గోడ కూలి తల్లీకూతుళ్లు ఇద్దరు మృతి చెందారు. అయితే ఈ ప్రమాదానికి గురైన ఇల్లు గ్రామంలోని శివారు ప్రాంతంలో ఉండటంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని నర్సీపురంలో తల్లి సత్తెమ్మ, కుమార్తె గంగ ఇద్దరూ నివాసం ఉంటున్నారు. వీరు నివసిస్తున్న ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. సోమవారం ఎప్పటిలాగానే తల్లీకుమార్తెలు ఇంట్లో నిద్రించారు. 

రాత్రి నిద్రలో ఉన్న సమయంలో ఇంటి గోడ కూలి వీరిపై పడింది. గోడ శిథిలాల కింద చిక్కుకుని వారు అక్కడికక్కడే మృతి చెందారు. అటుగా వెళ్లిన వారు బుధవారం గోడ కూలి ఉండటాన్ని గమనించి.. తల్లీకుమార్తెలున్న విషయం ఆరా తీయగా వారు మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details