Thirsty cries of monkeys వనంలోని వానరం.. దాహం కోసం ఎలా తహతహలాడుతుందో చూడండి! - drinking water in summer
Thirsty cries of monkeys.. అసలే వేసవికాలం ఆపై ఎండిన వాగులు, వంకలు.. రోడ్లు వెంట పడేసిన వ్యర్థాలతో ఆకలి తీర్చుకుంటున్న కోతులు.. నీరు దొరక్క దాహంతో అలమటిస్తున్నాయి. నీటి కోసం అల్లాడుతూ.. రోడ్ల వెంట తాగి పడేసిన వాటర్ బాటిళ్లు, టీ కప్పులను వెతికి దాహం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి మండలంలో కనిపించిన ఈ దృశ్యాలు జంతు ప్రేమికులనే కాదు.. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. మనుషులే కాదు తాము సైతం గుక్కెడు నీళ్ల కోసం ఇబ్బంది పడుతున్నామని, అడవులను వదిలి రహదారుల వెంబడి అలమటిస్తున్నామని ఈ వానరాలు తమ చేష్టలతో చెప్తున్నాయి. పెద్ద చెర్లోపల్లి మండలంలో రోడ్డు ప్రయాణం చేసే వాహనదారులకు నీటి కోసం పరి తపిస్తున్న వానరాలు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. రోడ్డు వెంబడి వాటర్ బాటిల్లను, టీ కప్పులను వెతుక్కుంటూ అందులో ఉన్న నీటిని తాగుతున్నాయి. ఈ దృశ్యాలను గమనించిన ప్రతి ఒక్కరూ.. మనుషులకే కాదు అడవిలో జీవించే వానరాలకు కూడా ఎంత కష్టం వచ్చిందోనని ఆవేదన చెందుతున్నారు. వానరాలు పడుతున్న కష్టాలను గమనించిన ప్రయాణికులు, వాహనదారులు తమ వద్దనున్న కొద్దో గొప్పో నీళ్లను వానరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు.