'విజయవాడ మల్టీప్లెక్స్‌లో బూజు పట్టిన సమోసాలు' - వీడియో వైరల్ - Worms in samosas at Vijayawada multiplex
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 8, 2023, 3:39 PM IST
Moldy Samosas at Vijayawada Multiplex: విజయవాడలోని ఓ మల్టీప్లెక్స్‌లో బూజు పట్టిన సమోసాలు అమ్మడం హాట్ టాపిక్‌గా మారింది. మల్లీప్లెక్స్‌లో సినిమా చూడడానికి వెళ్లిన ఓ మహిళ సమోసాలు కొనగా.. అవి బూజు పట్టి, పురుగులు వచ్చాయి. దాంతో ఆమె మల్టీప్లెక్స్ మేనేజర్, సిబ్బందిని అడిగినా స్పందించటం లేదంటూ.. సామాజిక మాధ్యమాల వేదికగా వీడియో పోస్ట్ చేశారు.
జరిగిన సంఘటన ఇది..విజయవాడ పటమటలో ఉన్న ఓ మల్టీప్లెక్స్‌లో సినిమా చూడడానికి ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. విరామ సమయంలో అక్కడున్న స్టాల్‌లో సమోసా కొనుగోలు చేశారు. వాటిని తినేందుకు ప్రయత్నించగా.. కుళ్లిన వాసన వచ్చింది. అనుమానం వచ్చి ఆ సమోసాలను తుంపి చూడగా.. లోపల బూజు పట్టి ఉంది. వెంటనే ఆమె కౌంటర్ వద్దకు వెళ్లి గట్టిగా నిలదీశారు. దాంతో అక్కడున్న విక్రేతలు సమాధానం చెప్పలేక తడపడ్డారు. అనంతరం ఫుడ్‌స్టాల్ నిర్వాహకులు, మల్టీప్లెక్స్ మేనేజర్‌ని అడిగినా స్పందన లేదంటూ.. మహిళ తన సెల్ఫోన్లో తీసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
''ఓ మహిళ వీడియో తీస్తూ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతున్నారని మల్టీప్లెక్స్ నిర్వాహకులు స్టేషన్‌కు ఫోన్ చేస్తే మేము అక్కడికి వెళ్లాం. థియేటరులో పడిపోయిన ద్విచక్ర వాహనం, ఇంటి తాళాలు తీసుకునేందుకు ఆమెను (మహిళ) లోపలికి అనుమతించలేదంటూ వీడియోలో ఉంది. ఈ ఘటనపై ఫిర్యాదు చేయమని ఆమెను మేము కోరాం. కానీ, స్టేషన్ వరకు వచ్చిన ఆమె.. మళ్లీ వస్తానని చెప్పి ఫిర్యాదు చేయకుండా వెళ్లిపోయారు'' - పటపట పోలీసులు