ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Moka Anand Fire on Minister Narayanaswamy నారాయణస్వామి.. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో: మోకా ఆనందసాగర్ - AP Latest News

🎬 Watch Now: Feature Video

video thumbnail
moka_anandasagar
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2023, 7:38 PM IST

Moka Anandasagar Condemned Deputy CM Narayanaswamy Comments:చంపే సంస్కృతి వంశపారంపర్యంగా సీఎం జగన్ కుటుంబానికి ఉందని టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్ (TDP Spokesperson Moka Anandasagar) ఆరోపించారు. చంద్రబాబును చంపితే ఆయన సతీమణి భువనేశ్వరే చంపాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి (Deputy CM Narayanaswamy) చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాకినాడలో దళితాగ్రహ భేరి పేరిట అఖిలపక్ష సమావేశం (All Party Meeting on Attacks on Dalits) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆనందసాగర్ హాజరయ్యారు. ఈ క్రమంలో కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్​ను ఆయన సతీమణి భారతిరెడ్డి చంపకుండా వైసీపీ నాయకులు కాపాడుకోవాలని హెచ్చరించారు. రాజకీయాల కోసం సొంత బాబాయ్​ని హత్య చేసిన చరిత్ర జగన్​ది అని ఆరోపించారు. ఇక మీదట చంద్రబాబు సితీమణి గురించి మాట్లాడే సమయంలో చాగ్రత్త వహించి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details