ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ

ETV Bharat / videos

'నేను కూడా నిన్న మొన్నటివరకు'..నోరు జారిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ - Jayamangala Venkataramana

By

Published : Apr 2, 2023, 9:59 AM IST

MLC Jayanmangala Venkataramana : అమరావతి రైతుల పోరాటంలో నిన్న మొన్నటి వరకు నేను కూడా ఉన్నవాడినే అంటూ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మాట జారారు. ఈ విషయాన్ని అమరావతి పోరాట రైతులకు వివరిస్తున్న క్రమంలో మీడియా కంటపడ్డారు. ఇది గమనించిన ఆయన వీడియో బయటకు రాకుండా తొలగించాలని మీడియాను కోరారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంగటరమణ ద్వారక తిరుమలకు రాగా ఈ అనుభవం ఎదురైంది. ద్వారకాతిరుమల చిన్న వెంకన్న దర్శనానికి వచ్చిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణను ఆలయానికి వచ్చిన అమరావతి రైతులు అడ్డుకున్నారు. భావితరాల భవిష్యత్ కోసం అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలని.. ఈ విషయాన్ని జగన్​ మోహన్​ రెడ్డి చెప్పాలని ఎమ్మెల్సీ వెంకటరమణను కోరారు. మొదట ఆమోదించి.. ఇప్పుడు వ్యతిరేకించటం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి.. అన్యాయం జరగకుండా చూస్తానని రైతులకు హామీ ఇచ్చారు. జగన్ మోహన్​​ రెడ్డి ఇకనైనా మనసు మార్చుకుని రాష్ట్రానికి న్యాయం చేయాలని.. అమరావతి రైతు పోరాట సాధన సమితి నేత కోటేశ్వరి కోరారు. మీరు ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీలో కూర్చొని మీరు ఒప్పుకుంటేనే కదా భూములిచ్చామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details