ఆంధ్రప్రదేశ్

andhra pradesh

mlc_janga_krishna_murthy_asking_mla_ticket_from_gurazala

ETV Bharat / videos

ఈసారి గురజాల సీటు ఎవరికి ? జంగా కృష్ణమూర్తికి దక్కేనా ! - గురజాల నియోజకవర్గం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 7:21 PM IST

MLC Janga Krishna Murthy hopes for Gurazala MLA Ticket:పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. గురజాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గురజాల వైసీపీ నుంచి ఎమ్మెల్యే సీటు ఆశిస్తుండగా, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకే సీటు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. దాచేపల్లిలో వైఎస్సార్​సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన జంగా, అధిష్టానం నుంచి పిలుపు రావడంతో సమావేశం విరమించుకుని తాడేపల్లికి బయలుదేరినట్లు సమాచారం. 

MLC Janga Krishna murthy v/s MLA Kasu Mahesh Reddy :గురజాల నియోజకవర్గంలో రెండుసార్లు శాసనసభ్యులుగా గెలుపొంది ప్రస్తుతం రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడిగా, శాసనమండలి విప్​గా, వైఎస్సార్​సీపీ ఎమ్మెల్సీగా బాధ్యత నిర్వహిస్తున్న జంగా కృష్ణమూర్తిని అధిష్టానం బుజ్జగించి ఊరుకుంటుందా లేక ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందా ? అని ఉత్కంఠ నెలకొంది. 

ABOUT THE AUTHOR

...view details