ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భూమిరెడ్డి రాంగోపాల్

ETV Bharat / videos

MLC Ramgopal Reddy Comments: విద్యాశాఖలో దొడ్డిదారిన బదిలీలు: ఎమ్మెల్సీ రాంగోపాల్​రెడ్డి - విద్యా వ్యవస్థపై రాంగోపాల్ రెడ్డి కామెంట్స్

By

Published : Jul 14, 2023, 4:54 PM IST

MLC Bhumireddy Ramgopal Reddy on Teachers Transfers: రాష్టంలో విద్యాశాఖ కార్యాలయాలు.. వైసీపీ కార్యాలయాలుగా మారిపోయాయని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్​రెడ్డి ఆరోపించారు. తప్పులమీద తప్పులు చేస్తూ విద్యా వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి భ్రష్టుపట్టించారని ఆయన మండిపడ్డారు. సాధారణ బదిలీల అనంతరం బ్లాక్ చేసిన పోస్టుల్లో వెంటనే ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అక్రమ బదిలీలు జరపడం సరికాదని హితవుపలికారు. విద్యాశాఖలో దొడ్డిదారిన బదిలీలు అధికమయ్యాయని విమర్శించారు. ఇటీవల రాష్ట్రంలో వందలమందికి ప్రభుత్వ బదిలీ ఉత్తర్వులు వచ్చాయని, మరి కొంతమంది బదిలీల కోసం పైరవీలు చేస్తున్నారన్న భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి.. దీనివల్ల సామాన్య ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. బదిలీలు, ఉద్యోగోన్నతులతో దాదాపు 40 శాతం మంది ఉపాధ్యాయులు ఈ నెల జీతాలు అందుకోలేకపోయారన్నారు. అనవసరమైన వివాదాలు సృష్టించి, ఉపాధ్యాయులను బెదరగొట్టే ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్.. ఈ సమస్యల పరిష్కరానికి చొరవ చూపాలన్నారు. విద్యా శాఖ నిర్వహించలేకుంటే మంత్రి బొత్స రాజీనామా చేయాలని భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details