MLC Anuradha Comments on Chandrababu Security in Rajahmundry Central Jail: "రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబు ప్రాణాలకు రక్షణ లేదు" - రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ బదిలీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 12, 2023, 1:55 PM IST
MLC Anuradha Comments on Chandrababu Security in Rajahmundry Central Jail :రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాణాలకు రక్షణ లేదని.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాది సిద్ధార్థ లూథ్రా చెబుతున్నది అక్షర సత్యమని (Advocate Sidharth Luthra Comments on Chandrababu Security) అన్నారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ బదిలీ వార్తలు వస్తున్నాయన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంఘటనలు పబ్లిక్‌లోనే జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పోలీసుల ఉదాసీన వైఖరి ఎన్నోసార్లు ప్రత్యక్షంగా చూశామని అనురాధ అన్నారు. అమరావతి పర్యటనలో చంద్రబాబు నాయుడు బస్సుపై వైసీపీ మూకలు రాళ్ల దాడులు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగామ పర్యటనలో రాళ్ల దాడిలో ఎన్ఎస్జీ కమాండో తలకు గాయమవ్వడం.. యర్రగొండపాలెంలో రాళ్ల దాడిలో మరో ఎన్ఎస్జీ కమాండో తలకు గాయాలు.. పోలీసుల ప్రేక్షక పాత్రకు నిదర్శనమని ఆమె అన్నారు. అంగళ్లు వద్ద రాళ్ల దాడి జరిగితే బాధితులపైనే హత్యాయత్నం కేసు నమోదు చేశారని ఆక్షేపించారు. 'సేవ్ చంద్రబాబు' అనేది మన నినాదం కావాలని పంచుమర్తి అనురాధ పిలుపునిచ్చారు.