ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MLA Vasupalli Ganesh

ETV Bharat / videos

లెటర్​హెడ్​ తెచ్చిన వారికి మందు బాటిల్, కోడి - వాసుపల్లి విద్యాసంస్థ భవనంలో పంపిణీ - MLA Vasupalli news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 16, 2024, 6:51 PM IST

MLA Vasupalli Ganesh:  విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కనుమ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి చెందిన కళాశాలలో మద్యం, కోడి మాంసం పంపిణీ జరిగింది. తెలుగుదేశం నుంచి ఎన్నికై వైఎస్సార్సీపీలోకి పార్టీ ఫిరాయించిన వాసుపల్లి గణేష్ కుమార్ కి చెందిన డిఫెన్స్  అకాడమీలోనే కనుమ పండుగ సందర్భంగా ఈ మద్యం, కోళ్ల పంపిణీ జరిగింది. రామబాణం క్యాంపస్ గా వ్యవహరించే ఈ కళాశాలలో డిఫెన్స్ ఉద్యోగాలకు వెళ్లేందుకు శిక్షణ తీసుకునే విద్యార్థులు కూర్చునే తరగతి గదుల్లో 400 మద్యం బాటిళ్లు, బతికి ఉన్న కోళ్ల పంపిణీ చేస్తున్న వైనానికి సంబందించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అయ్యాయి.

మద్యం, కోళ్ల పంపిణీ చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే గణేష్  కళాశాల పై ఫ్లోర్ లో ఉన్న కార్యాలయంలోనే ఉన్నారు. ఎమ్మెల్యే లెటర్ హెడ్ పై టోకెన్ నెంబర్లను ఆ టోకెన్​లు ఉన్నవారికి మాత్రమే పంపిణీ జరిగింది. ఓ విద్యా సంస్ధ భవనాలను ఈరకంగా వినియోగించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏ పార్టీకి సపోర్టు చేయకుండా తటస్ధంగా ఉన్నవారిని గుర్తించి, వాసుపల్లి గణేష్ కుమార్ వారికి పండగ పేరుతో ఈ మద్యం, బతికిన కోడిని పంపిణీ చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో ఉన్న వాసుపల్లి కి దక్షిణం టికెట్ ఇవ్వద్దని పార్టీలో పలువురు వ్యతిరేకులు అధిష్టానానికి ఇప్పటికే చెప్పారు. పండగ సందర్భంగా ఇలా చేయడం వివాదానికి కారణమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details