MLA Undavalli Sridevi met Chandrababu: చంద్రబాబుతో ఉండవల్లి శ్రీదేవి సమావేశం.. త్వరలో భవిష్యత్ ప్రణాళిక..! - Srikakulam District News
MLA Undavalli Sridevi met Chandrababu: సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనను ఏపీలో అడుగుపెట్టకుండా భయభ్రాంతులకు గురి చేశారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పర్యటనలో ఉన్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుని ఎమ్మెల్యే శ్రీదేవి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. దాదాపు 20 నిమిషాల పాటు చంద్రబాబు, అచ్చెన్నాయుడులతో సమావేశమయ్యారు. చంద్రబాబు ఉన్నారనే ధైర్యంతోనే రాష్ట్రానికి వచ్చి ఆయనను కలిసినట్లు తెలిపారు. వైసీపీ నుంచి బయటకు వచ్చాక వైసీపీ గూండాల బెదిరింపులకు గురై కష్టాల్లో ఉండి కన్నీరు పెట్టుకున్న సమయంలో.. వారి నుంచి తనకు రక్షణ కల్పించింది చంద్రబాబే అని ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు. ప్రస్తుతం మర్యాద పూర్వకంగానే చంద్రబాబుని కలిశానని.. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తానని స్పష్టం చేశారు. జగన్ చెప్పే నాడు-నేడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో వివరిస్తానన్నారు. ఒక విజనరీ ఉన్న లీడర్ని కలవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.