ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MLA Talari Venkatarao sitting at Tammineni Sitaram Feet

ETV Bharat / videos

MLA Talari Venkatarao sitting at Tammineni Sitaram Feet: తమ్మినేనీ ఇదేం పని..! దళిత ఎమ్మెల్యేకి అవమానం.. కాళ్ల దగ్గర కూర్చున్న వెంకట్రావు - MLA sitting at the feet of Speaker tammineni

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2023, 12:14 PM IST

MLA Talari Venkatarao sitting at Tammineni Sitaram Feet: తన మాటలు, చేతలతో తరచూ వివాదాల్లో నిలిచే స్పీకర్ తమ్మినేనిపై.. మరోసారి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి సాక్షిగా దళిత ఎమ్మెల్యేకు అవమానం జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయాన్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం సతీసమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ మండపంలో స్పీకర్ తమ్మినేని దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి.. పట్టు వస్త్రాలు సమర్పించారు. 

ఈ క్రమంలో సీతారాం దంపతులు పీటలపై కూర్చోగా... తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వారి కాళ్ల వద్ద కూర్చున్నారు. ఎమ్మెల్యే దళితుడు కాబట్టే ఆయనను కాళ్ల దగ్గర కూర్చోబెట్టారని.. ఎస్సీ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా గతంలో సైతం తమ్మినేని పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details