YCP MLA Srikanth Reddy చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలనకు రావడం విడ్డూరం - ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి - రాయచోటి వార్తలు
YCP MLA Srikanth Reddy comments on Chandrababu అధికారంలో ఉన్నపుడు రాయలసీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు... ఇప్పుడు ప్రాజెక్టుల పరిశీలనకు రావడం విడ్డూరంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల సందర్శనకు వచ్చే ముందు చంద్రబాబు సీమ వాసులకు క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. కడప వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషాతో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతు.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు... ఇపుడు ఏ మొఖం పెట్టుకుని సీమ ప్రాజెక్టుల సందర్శనకు వస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గండికోట ప్రాజెక్టులో బాబు ఏనాడు నీరు నిల్వ చేయలేదని... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హయాంలో 26 టీఎంసీల నీరు నిల్వ చేశామని గుర్తు చేశారు. గాలేరు - నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులకు చంద్రబాబు పైసా కూడా ఖర్చు చేయలేదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టులకు 5600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వివరించారు. రాష్ట్ర విభజనకు కారకుడైన చంద్రబాబుకు రాయలసీమ ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్యే విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.