ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

ETV Bharat / videos

MLA Ramanaidu fire on YSRCP Govt: వరద బాధితులకు పట్టెడన్నం పెట్టలేని దౌర్భాగ్య ప్రభుత్వమిది: ఎమ్మెల్యే నిమ్మల - Palakollu Constituency

By

Published : Aug 1, 2023, 5:06 PM IST

Palakollu MLA Ramanaidu Comments: వరద బాధితులకు కడుపునిండా ఆహారం పెట్టలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఇది అని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు విమర్శించారు. వరద బాధితుల పరామర్శకు మించి ముఖ్యమంత్రికి పెద్ద పని ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా చాకలి పాలెం సమీపంలోని పాలకొల్లు నియోజకవర్గంలో వరదల కారణంగా జలదిగ్బంధంలో చిక్కుకున్న కాన కాయలంక గ్రామాన్ని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పడవలో వెళ్లి సందర్శించారు. వరద బాధితులను పరామర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే చాకలి పాలెం ఏటి గట్టు నుంచి కనకాయ లంక వరకు గోదావరి నది పాయపై ఫ్లై ఓవర్ నిర్మిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. సీఎ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి రాజ ప్రసాదంలో కూర్చుని మాఫియా డబ్బులు లెక్కించుకుంటున్నారని.. ఆ కారణంగా ఆయన వరద బాధితులను పరామర్శించడం లేదని ఎమ్మెల్యే రామానాయుడు మండిపడ్డారు. వరదలో ఇళ్లు మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఏ మూల నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనే భయాందోళనలో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు. రోజుల కొద్దీ ఆహారం లేక పస్తులు ఉంటున్నా ఈ ప్రభుత్వానికి పట్టదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.  

ABOUT THE AUTHOR

...view details