ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MLA_Payyavula_Keshav_Distribute_Land_To_Poor_People

ETV Bharat / videos

పేద ప్రజలకు పయ్యావుల కేశవ్ సొంత భూమి పంపిణీ - పయ్యావుల భూమి పంపిణీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2024, 11:39 AM IST

MLA Payyavula Keshav Distribute Land To Poor People :అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ తన సొంత పొలాన్ని పేదలకు పంచారు. సుమారు కోటి 33 లక్షల రూపాయలు విలువ చేసే 6.65 ఎకరాల వ్యవసాయ భూమిని మైలారంపల్లికి చెందిన 165 మంది పేదలకు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 2.5 సెంట్ల భూమిని మహిళల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించి పత్రాలు అందజేశారు. పీఏబీఆర్ జలాశయాన్ని ఆనుకుని ఉన్న మైలారంపల్లి గత ఏడాది ముంపుకు గురైంది. తమ ఇబ్బందులను తీర్చాలని గ్రామస్థులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగా ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడు అక్కడి ప్రజలు పడిన ఇబ్బందులు, వేదనను కళ్లారా చూసిన కేశవ్‌ తట్టుకోలేక పోయారు. భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో తన భూమిని సాయంగా ఇచ్చినట్లు కేశవ్‌ తెలిపారు.

భవిష్యత్తులో ఆ స్థలాల్లో పూర్తి స్థాయిలో మౌళిక వసతులను కల్పించి వారి జీవనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చొరవ చూపనున్నట్లు కేశవ్‌ వివరించారు. పేదల పక్షాన నిలుస్తూ, వారికి మెరుగైన జీవనం అందించాలన్నదే తన తపన అని అన్నారు. వారికి సేవ చేయడం సంతోషంగా ఉందన్నారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులు అనందాన్ని వ్యక్తం చేస్తూ, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తాము చాలా ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని, దానిని సద్వినియోగం చేసుకుని, ఇళ్లను నిర్మించుకుంటామన్నారు. 

ABOUT THE AUTHOR

...view details