ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ.. సమాధానం చెప్పి కదలాలంటూ నిలదీత..!

ETV Bharat / videos

Protest against MLA: వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ.. సమాధానం చెప్పి కదలాలని నిలదీత

By

Published : May 31, 2023, 10:56 PM IST

Updated : Jun 1, 2023, 6:28 AM IST

MLA Padmavathi was protested by villagers: ముఖ్యమంత్రి జగన్​ ఆదేశాల మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు.. కానీ వారికి ప్రజల నుంచి నిరసన సెగ అనుకోని రీతిలో తగులుతుంది. అడగడుగునా వారిని అడ్డుకుని వారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గ్రామాలకు చేసిన అభివృద్ది ఏంటని.. యువత నుంచి పెద్దల వరకూ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి నిరసన సెగ ఊహించని రీతిలో తగిలింది. 

జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం దండువారిపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పాల్గొన్నారు. ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకున్న గ్రామస్థులు.. ఎన్నికల హామీలపై నిలదీసి.. ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇంతవరకు ఎందుకు పరిష్కారం కాలేదని గ్రామస్థులు అడ్డుకున్నారు. శ్మశాన వాటికతో పాటు ఇంటింటికీ తాగు నీరు అందిస్తామని చెప్పిన మాటలు నాలుగేళ్లు అయినా నెరవేర్చలేదని ప్రశ్నించారు.. మాకు కచ్చితమైన సమాధానం చెప్పి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ప్రశ్నించారు. పక్కనే కార్యకర్తలు, పోలీసులు ఉండటంతో కాసేపు గ్రామస్థులతో వారికి వాగ్వాదం జరిగింది. 

Last Updated : Jun 1, 2023, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details