MLA Nallapureddy on leopard Attack incident ఎమ్మెల్యే నల్లపురెడ్డి.. ఆ నోటి దూల ఏంటీ? - MLA Nallapureddy Prasanna Kumar Reddy
MLA Nallapureddy Prasanna Kumar Reddy on chirutha Attack on Girl: తిరుమల నడక మార్గంలో చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి లక్షిత ఘటనపై నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించారు. అయితే ఈ క్రమంలో చిన్నారి మృతి విషయంలో తల్లిదండ్రులపై ఆయన అనుమానం ఉందని పేర్కొంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. కాగా ఈ ఘటనపై విచారణ జరిపించాలని పోలీసులను, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను ఎమ్మెల్యే నల్లపురెడ్డి కోరారు. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై లక్షిత స్వగ్రామమైన పోతిరెడ్డిపాలెం గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నబిడ్డను ఏ తల్లిదండ్రులైనా ఎందుకు చంపుకోవాలని అనుకుంటారని మండిపడుతున్నారు. తిరుమలలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తున్నా సరే.. ఎమ్మెల్యే ఇలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కుమార్తె మృతితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులపై విచారణ చేయాలి అనడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నారు. తల్లిదండ్రులపై విచారణ చేపట్టాలన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.