ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MLA_Kolusu_ParthaSarathy_Interview

ETV Bharat / videos

వైఎస్సార్సీపీలో బీసీలు ఎదగకూడదా?: ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి - వైఎస్సార్సీపీలో బీసీలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2024, 2:06 PM IST

MLA Kolusu ParthaSarathy Interview :ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవటమే తన అసమర్ధతగా వైఎస్సార్సీపీ అధిష్టానం భావించి ఉండొచ్చని కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏ అర్హత లేదని మంత్రి పదవి ఇవ్వలేదో తెలీదని వ్యాఖ్యానించారు. బీసీలకు వైఎస్సార్సీపీలో అగ్ర తాంబూలం అనేది నేతి బీర కాయలో నెయ్యి తరహానేనని విమర్శించారు. బలహీన వర్గాలకు వైఎస్సార్సీపీలో గుర్తింపు ఉంటుందని, గతంలో తానూ చెప్పిన వాడినేనన్న పార్థసారథి, కానీ అది తప్పని తెలుసుకోవటానికి ఎంతో సమయం పట్టలేదని తెలిపారు. బీసీలు, దళితులు ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడాలనుకుంటారన్నారని, కానీ ఒకరి కాళ్ల కింద, ఎవరి పెత్తనం మీదో ఆధారపడాల్సి వస్తే తనలా ఆత్మాభిమానం మాత్రం చంపుకోలేరని స్పష్టం చేశారు. 

YSRCP Changing Constituency Incharges :గన్నవరంలో అధికార పార్టీ గెలిచే పరిస్థితి లేదని, తనను ఆ స్థానానికి పంపాలని చూశారని పార్థసారధి అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ నేతను కాబట్టి తాను గన్నవరంలో ఓడిపోయినా పర్లేదని అధిష్టానం భావించి ఉండవచ్చని ఆయన అన్నారు. తాను గన్నవరం వెళ్లేందుకు విభేదించటంవల్లే పార్టీకి నచ్చనందుకే వేరొకరికి పెనమలూరు టికెట్ ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. పెనమలూరు టికెట్‌ పొందిన జోగి రమేష్​కు కొలుసు పార్థసారధి అభినందనలు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details