MLA Ketireddy Sensational Comments: ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..! - Dharmavaram latest news
MLA Keti Reddy Sensational Comments: ప్రతి ఒక్కరూ అన్నం తినేటప్పుడు వైసీపీకి ఓటేస్తామని ప్రమాణం చేయాలంటూ.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పొట్టి శ్రీరాములు సర్కిల్ ప్రాంతంలో మాట్లాడిన ఎమ్మెల్యే కేతిరెడ్డి ఈ మేరకు వ్యాఖ్యానించారు. సీఎం జగన్, తాను ప్రజలకు ఎంతో సేవ చేశామని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతోందని అన్నారు. తాము చేసిన మేలు మర్చిపోవద్దన్న ఆయన.. కొంతమంది అది మర్చిపోయి పక్కచూపులు చూస్తున్నారని పేర్కొన్నారు. అన్నం తినని వారే అలా పక్క చూపులు చూస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా.. ఇటీవల కూడా ఎమ్మెల్యే కేతిరెడ్డి వైసీపీ కార్యకర్తలను తీవ్రవాదులతో పోల్చుతూ.. మాట్లాడారు. దీంతో ఆ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.