ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

MLA was paraded on palanquin విమర్శలకు దారి తీసిన ఎమ్మెల్యే పల్లకి ఊరేగింపు.. ఎక్కడంటే..! - MLA Jogarao

🎬 Watch Now: Feature Video

ఎమ్మెల్యే పల్లకిలో ఊరేగించిన గ్రామస్థులు.. ఎక్కడంటే..!

By

Published : May 27, 2023, 12:05 PM IST

Updated : May 27, 2023, 12:17 PM IST

MLA Jogarao was paraded in a palanquin: పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలోని నూకలవాడలో ఎమ్మెల్యే జోగారావును గ్రామస్తులు పల్లకిలో ఊరేగించారు. ఈఘటనపై నియోజక వర్గంలో తీవ్ర రాజకీయ విమర్శలు వ్యక్తమైయ్యాయి. ఈ గ్రామానికి నాలుగు దశాబ్దాలుగా తారు రోడ్డు సౌకర్యం లేదు. ఇన్నాళ్లు ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చినా నెరవేర్చలేదు. ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జోగారావు గ్రామంలో పర్యటించారు. ఈ సమయంలో గ్రామస్థులు రోడ్డు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రోడ్డును వేయించారు. దీంతో  శుక్రవారం రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యేను సర్పంచ్​ ఝాన్సీ ఆధ్వర్యంలో గ్రామస్థులు సత్కరించి ఊరేగించారు. గ్రామాల్లో తాగునీటికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే జోగారావు తెలిపారు. పనుకుపేటలో ఓవర్​హెడ్ ట్యాంకు నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తోందని ఎమ్మెల్యే కళావతి అన్నారు.  కార్యక్రమంలో ఎంపీపీ డి వెంకటరమణనాయుడు, జడ్పీటీసీ సభ్యురాలు జె కన్న తల్లి, సర్పంచ్​ జగన్మోహనరావు, నాయకులు. పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Last Updated : May 27, 2023, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details