Anil Kumar Yadav on Roopkumar బాబాయి వర్సెస్ అబ్బాయి ఎపిసోడ్లో.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ కౌంటర్ కామెంట్స్ - తాజా వార్తలుట
MLA Anil Kumar Yadav: డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ విమర్శలకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. బాబాయ్ రూప్ కుమార్కు ఎమ్మెల్యే అనిల్ కుమార్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేత హాజీపై జరిగిన దాడికి నాకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే అనిల్ కుమార్ తెలిపారు. సిటీలో ఎలాంటి ఘటన జరిగినా దానికి కారణం అనిల్ అంటూ.. తనపై బురద జల్లుతున్నారని విమర్శించారు. ఈ దాడి వెనుక నేనున్నానని బాధితుడిని ప్రోత్సహించి, తన పేరు చెప్పించారని ఎమ్మెల్యే అనిల్ అరోపించారు. గతంలో హాజీకి ఏవైనా వివాదాలు ఉంటే వాటి వల్ల ఈ దాడి జరిగి ఉండవచ్చు అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. తన ఓపికను పరీక్షించవద్దంటూ హెచ్చరించారు. అన్నిటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. సామాజిక మాద్యమాల్లో వచ్చే బెట్టింగ్ రాజు అనే మచ్చ తాను మోస్తున్నానని, ఈ పాపం నాది కాదని నన్ను విమర్శించే వ్యక్తి దేవుని ముందు ప్రమాణం చేస్తాడాని అనిల్ కుమార్ ప్రశ్నించాడు. కొందరిపై ఇంటర్నేషనల్ నోటీసులు వచ్చి ఉన్నాయని, లీకులు ఇవ్వాలంటే ఎంతసేపు పట్టదన్నారు.