ఓటరు జాబితాలో అవకతవకలు - ఒకే ఇంటి నెంబర్‌పై పదుల సంఖ్యలో ఓట్లు - ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 10:48 AM IST
Mistakes in Voter List Chebrolu Village Guntur District: ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంది. దీనికి గుంటూరు జిల్లా చేబ్రోలులోని ఓ పోలింగ్ కేంద్రంలోని జాబితానే పెద్ద ఉదాహరణ. ఇక్కడ ఒకే డోర్ నెంబర్లో పదుల సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్ బూత్ నెంబర్ 141 లో ఒకే డోర్ నెంబర్‌పై 24 ఓట్లు ఉన్నాయి. అయితే ఆ జాబితాలోని వారెవరూ ఆ ఇంటి నెంబర్లలో నివాసం ఉండడం లేదు. పోని గతంలో ఐనా ఆ ఇంటి నెంబర్‌పై నివాసం ఉండి.. ఇప్పుడు మారిపోయారా అంటే ఆదీ కాదు. అంతేకాకుండా మృతి చెందిన వారి పేర్లు సైతం అలాగే జాబితాలో ఉన్నాయి. విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా.. ఈఆర్‌ఓ లాగిన్ పెండింగ్‌లో ఉందని, వెంటనే తొలగిస్తామని వివరణ ఇచ్చారు. ఓటరు జాబితాలోని అవకతవకలను సరిచేయడానికి ఇటివలే బీఎల్వోలు.. నెల రోజులపాటు ఇంటింటికి తిరిగి ఓటర్ లిస్టును తనిఖీ చేశారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో.. అభ్యంతరాలకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.