ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Minister_Seediri_Appalaraju_Controversial_Comments

ETV Bharat / videos

Minister Seediri Appalaraju Controversial Comments: వైసీపీ మద్దతుదారుల ఓట్లైతే ఉంచెయ్‌.. వైరివర్గాల ఓట్లైతే.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు - Seediri Appalaraju Viral Video on Votes

By

Published : Aug 4, 2023, 8:11 PM IST

Minister Seediri Appalaraju Controversial Comments on Votes: గత కొంత కాలంగా ఓట్ల తొలగింపుపై ప్రతిపక్షాలు.. అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. వైసీపీకి ఓట్లు వేయనివారి ఓట్లను తొలగిస్తున్నారని మండిపడుతున్నాయి. అదే విధంగా ఒకే ఇంటి నెంబర్ మీద పదుల సంఖ్యలో ఓట్లు ఉండటం, వందల సంఖ్యలో తొలగింపు వంటివి తాజాగా వెలుగుచూస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలను నిజం చేసే విధంగానే వైసీపీకి చెందిన మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయి. మంతి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. 

వైసీపీ మద్దతుదారుల ఓట్లైతే ఉంచెయ్‌.. వైరివర్గాల ఓట్లైతే అబ్జెక్షన్‌ పెట్టెయ్‌..! ఇదెవరో చెప్పిన మాట కాదు..! సాక్షాత్తూ మంత్రి సీదిరి అప్పలరాజు.. వైసీపీ కార్యకర్తలకు ఇచ్చిన ఆదేశం..! నాలుగు రోజుల క్రితం.. పలాసలో కార్యకర్తల సమావేశం నిర్వహించిన అప్పలరాజు బహిరంగంగానే ఈ ఆదేశాలిచ్చారు. విపక్షాల ఒట్లను గంపగుత్తగా తొలగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. మంత్రి వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details