ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Etv Bharat

ETV Bharat / videos

Zoological Parks: జంతు ప్రదర్శన శాలల అభివృద్ధికి చర్యలు: మంత్రి పెద్దిరెడ్డి

By

Published : Jun 15, 2023, 4:11 PM IST

Zoological Parks in AP: రాష్ట్రంలోని జంతుప్రదర్శనశాలల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన జూ అథారిటీ గవర్నింగ్ బాడీ సమావేశంలో తిరుపతి, విశాఖ జూపార్క్​ల అభివృద్ధి కార్యాచరణపై మంత్రి మాట్లాడారు. దేశంలోని జూపార్క్ అథారిటీలతో జంతువుల మార్పిడి గురించి సంప్రదింపులు జరుపుతున్నట్టు మంత్రి తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలో దీన్ని పూర్తి చేయాల్సిందిగా అధికారులకు సూచనలు చేశారు. 

 తిరుపతి జూపార్క్​లో ఎలక్ట్రికల్ స్కూటర్లను ప్రవేశపెడుతున్నామని, దీనిద్వారా 30 శాతం జూపార్క్​కు ఆదాయం లభిస్తుందని మంత్రి వెల్లడించారు. విశాఖ జూపార్క్​లోనూ ఈ విధానంను ప్రవేశపెడతామని తెలిపారు. అలాగే జూపార్క్​ల్లో జంతువులను సంరక్షించే సిబ్బంది నియామకాలు, రెగ్యులరైజేషన్​పై హేతుబద్దత కోసం సమగ్ర నివేదికను సిద్దం చేయాలని పీసీసీఎఫ్​ను మంత్రి ఆదేశించారు. అస్సాం ప్రభుత్వంతో సంప్రదించి ఖడ్గమృగాలను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జునాఘడ్, చెన్నై, వరంగల్ జూపార్క్ అథారిటీలతో కూడా సంప్రదింపులు జరపాలని, వారి వద్ద ఉన్న జంతువులకు బదులుగా మన రాష్ట్రంలోని జూపార్క్​ల్లో ఉన్న జంతువులను మార్చుకోవాలని మంత్రి సూచించారు. పర్యావరణహిత సామాగ్రితో తయారు చేసిన జంతు నమూనాలను మంత్రి పెద్దిరెడ్డి ఆవిష్కరించారు.  

ABOUT THE AUTHOR

...view details