Minister Peddireddy Ramachandra Reddy on Power Cuts 'రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చూడాలి'.. మంత్రి పెద్దిరెడ్డి ఆదేశం - బహిరంగ మార్కెట్లో విద్యుత్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 24, 2023, 11:38 AM IST
Minister Peddireddy Ramachandra Reddy on Power Cuts: రాష్ట్రంలో ఎటువంటి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. డిమాండ్‌కు అనుగుణంగా జెన్కో కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పెంచాలని సూచించారు. అవసరమైనంత మేర ఎక్స్చేంజీల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిపైనా దృష్టి పెట్టాలని సూచనలు ఇచ్చినట్టు వివరించారు. ప్రస్తుతం ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల విద్యుత్ వినియోగం పెరిగిందని మంత్రి స్పష్టం చేశారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్ సులువుగా లభించటం లేదన్న మంత్రి.. జెన్కో విద్యుత్ ప్లాంట్లను పూర్తి స్థాయిలో పనిచేయించాలని సూచించారు. విద్యుత్ కోతలు లేకుండా ముందస్తు ప్రణాళికతో సరఫరా చేయాలని సూచనలు చేశారు. వర్షాలు లేకపోవడం, పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్న కారణంగా ప్రస్తుతం 228.94 మిలియన్ యూనిట్ల డిమాండ్ కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం మేర అధిక వినియోగం నమోదు అవుతోందని మంత్రి స్పష్టం చేశారు.