ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Kottu Satyanarayana

ETV Bharat / videos

Minister Kottu on Pawan: పవన్​కల్యాణ్​ వారాహి యాత్ర విఫలమైంది: మంత్రి కొట్టు సత్యనారాయణ - కొట్టు సత్యనారాయణ కామెంట్స్ పై జనసేన కార్యకర్తలు

By

Published : Jun 27, 2023, 5:24 PM IST

Kottu Satyanarayana criticized Pawan: పవన్ కల్యాణ్ వారాహి యాత్ర అట్టర్ ప్లాప్ అయ్యిందని మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఆయన ప్రసంగాలు ఉన్మాదానికి ఎక్కువ.. పిచ్చికి తక్కువగా ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్  తనను తాను విప్లవకారుడుని అని చెప్పుకుంటారని ఎద్దేవా చేశాడు. గోదావరి జిల్లాల్లో  వైసీపీకి ఒక్క సీటు రాకుండా ఈయన అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. సమయం సందర్భం లేకుండా ముద్రగడపై ఆరోపణలు చేస్తున్నారని నిలదీశారు. ముద్రగడపై పవన్ చేసిన ఆరోపణల వల్ల కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. పవన్ కల్యాణ్ తిరిగేది అంతా కాపు సామాజిక వర్గాలు ఉండే ప్రాంతాలేనని మంత్రి కొట్టు  తెలిపారు. వారి మనోభావాలు దెబ్బతీసి.. కాపుల్లో చీలిక తెచ్చే ప్రయత్నంగా భావిస్తున్నామన్నారు.  రైలు దహనం కేసులో ముద్రగడ చాలా అపవాదులు ఎదుర్కొన్నారు. కులాల చిచ్చు రగిల్చేది పవన్ కల్యాణే.. మళ్లీ సుద్దులు చెప్పేది ఆయనేనన్నారు. 

 పవన్ ప్రసంగాలు ఆయన మానసిక పరిస్థితి ఏమిటో తెలియచేస్తున్నాయని వెల్లడించారు. జగన్​ను తిట్టే విషయంలో ఆయన బాగానే మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు గురించి మాట్లాడే విషయంలో తేడా వచ్చేస్తోందన్నారు. వారాహి లారీ యాత్ర విఫలం అయ్యిందన్న కొట్టు.. ఆయన గ్రాఫ్ పదింతలు కిందకు పడిపోయిందని విమర్శించారు. పవన్ సభకు హాజరయ్యే వారి సంఖ్య వేల నుంచి వందల్లోకి పడిపోయిందన్నారు. పవన్​ను గోదావరి జిల్లాలకు పంపి ఓట్లు చీల్చాలన్న టీడీపీ వ్యూహం పారలేదన్నారు. చంద్రబాబు వైపు చేరాల్సిన అవసరం పవన్​కు ఏమొచ్చిందని మంత్రి కొట్టు  ప్రశ్నించారు. టీడీపీ-జనసేనది అపవిత్రమైన పొత్తు అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details