ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పవన్​ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సత్యనారాయణ

ETV Bharat / videos

Minister Kottu Reply to PK: పార్టీ పెట్టింది రాజకీయాలు చేసేందుకా.. జగన్‌ను తిట్టేందుకా - ntr dist latest news

By

Published : Jul 13, 2023, 1:46 PM IST

Minister Kottu Reaction On Pawan Kalyan Comments: ఎవరి మెప్పు కోసం వాలంటీర్లపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. వాలంటీర్లపై పవన్​ చేసిన వ్యాఖ్యలు, చెప్పిన గణాంకాలు ఆయనకు ఎవరు రాసిచ్చారో చెప్పాలన్నారు. జనసేన పార్టీని రాజకీయాలు చేసేందుకు పెట్టారా..  జగన్‌ను తిట్టేందుకు పెట్టారా అనే విషయంపై పవన్​ స్పష్టతనివ్వాలని మంత్రి డిమాండ్‌ చేశారు. ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే జనసేన అధికారంలోకి వస్తే క్వాలిటీ మద్యం అమ్మిస్తాను.. యువతతో తాగిస్తాను అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయని మంత్రి సత్యనారాయణ ఎద్దేవా చేశారు. వాలంటీర్లు ఇచ్చిన సమాచారం హైదరాబాద్​కు చేరుతోందనేందుకు పవన్ దగ్గర ఎలాంటి ఆధారం ఉందో చెప్పాలని ఆయన ​ప్రశ్నించారు. వాలంటీర్స్ ప్రజలకు సంబంధించిన వివరాలను అసాంఘిక శక్తులకు ఇస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవన చేసిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపాయి. పవన్​ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే కొందరు మంత్రులు కూడా స్పందించారు.

ABOUT THE AUTHOR

...view details