Minister Kottu Comments on Pawan Kalyan: జనసేన - టీడీపీ పొత్తులపై మంత్రి కొట్టు సత్యనారాయణ ఏమన్నారంటే..! - దుర్గగుడి ఈవో బదిలీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 3, 2023, 7:54 PM IST
Minister Kottu Comments on Pawan Kalyan:తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు తో డీల్ కుదుర్చుకుని పవన్ కల్యాణ్కా పుల పరువు తీశారని మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. సెంట్రల్ జైల్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకుని కాపులను తల దించుకునే పని చేశారన్నారు. 2019 ఎన్నికల్లో 54 శాతం మంది కాపులు వైసీపీ(YCP) కి మద్దతు పలికారని తెలిపారు. ఈసారి మిగతా 46 శాతం మంది కూడా వైసీపీ కే మద్దతు ఇస్తారన్నారు. టీడీపీ(TDP) ఏమన్నా పట్టించుకోవద్దని కాపులకు చెప్పడానికి పవన్ (Pawan) ఎవరని ప్రశ్నించారు. తెలుగుదేశం - జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీ కి ఏం అభ్యంతరం ఉంటుందన్నారు. తనకు - వెలంపల్లికి మధ్య విభేదాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. తానేమీ విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి పోటీ చేయడం లేదన్నారు. దుర్గగుడి ఈవో బదిలీ సైతం మంత్రి స్పందించారు. బదిలీ అయితే విచిత్రం ఏముందని ప్రశ్నించారు. రెండేళ్ల గడువు తర్వాత ఏ అధికారి అయినా బదిలీ కావాల్సిందేనని మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana) పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక చేశామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆగస్టు 6 తేదీన అన్నవరం లో మొదలైన ధర్మ ప్రచారం వివిధ దేవాలయాల్లో మాసొత్సవం, వారోత్సవాలుగా నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ తో పాటు వివిధ దేవాలయాల నుంచి ఆధ్యాత్మిక పత్రికలు వెలువరిస్తామని వెల్లడించారు. ఆలయాల చరిత్ర ప్రాముఖ్యత తెలిసేలా ఈ పత్రికలు ఉంటాయని తెలిపారు.